Start/Nachrichten

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్!

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్!

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

NachrichtenartikelGute MittelstufeInspiration & HumorKostenlos lesbarDruckbares Arbeitsblatt
Telugu mit Übersetzungen ins DeutschQuizze

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్!

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాలాజాపేటకు చెందిన మురళి గత 15 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వాలాజాపేటలో నివసిస్తున్న తన తండ్రిని చూసేందుకు మురళి చెన్నై నుంచి కారులో వచ్చాడు. తండ్రితో కలిసి భోజనం చేసిన అనంతరం కారును ఇంటి సమీపంలో పార్క్ చేశాడు.

అనంతరం కారులో ఏసీ ఆన్ చేసి మురళి నిద్రపోయాడు. అయితే చాలా సమయం గడిచినా మురళి కారు నుంచి బయటకు రాకపోవడంతో అతని తండ్రికి అనుమానం వచ్చింది. వెంటనే కారు తలుపు తెరిచి చూడగా మురళి అపస్మారక స్థితిలో కనిపించాడు. శ్వాస తీసుకోకుండా, మాట్లాడకుండా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో అతన్ని వెంటనే అంబులెన్స్లో వాలాజాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడి వైద్యులు పరీక్షించి మురళి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న మురళి భార్య ప్రియ వాలాజాపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కారును పార్క్ చేసి ఏసీ ఆన్ చేసి నిద్రించిన సమయంలో వాహనం నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువు కారులోకి చేరి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దాని ప్రభావంతో మురళికి ఊపిరాడక మృతి సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం స్పష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు.

మురళి మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని చూసేందుకు చెన్నై నుంచి వాలాజాపేటకు వచ్చిన మురళి ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Tippe auf ein unterstrichenes Wort, um seine Bedeutung zu sehen.

Quelle: TV9 Telugu

1 / 8

Über diese Lektion

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Sie ist auf gute mittelstufe-Niveau verfasst, also Flüssige Konversation. Lies den Text, höre zu, wo Audio verfügbar ist, tippe auf unbekannte Wörter und schließe mit dem Quiz ab.

Häufig gestellte Fragen

Auf welchem Niveau ist diese Lektion?
Das ist eine Gute Mittelstufe-Lektion: Flüssige Konversation.
Ist diese Lektion kostenlos?
Ja. Du kannst die gesamte Lektion kostenlos lesen. Kostenlose Konten haben tägliche Limits für Wortnachschlagen, Quizze und KI-Tools; Premium hebt diese auf.
Wie verstehe ich Wörter, die ich nicht kenne?
Tippe auf ein Wort für seine Bedeutung, speichere es in deiner Wortliste und wiederhole es später in Abständen.

Als Nächstes für Gute Mittelstufe

Inspiration & HumorMeisterschaft
HMTV1. Sept.

Gold Price Today: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

Gold Price Today: గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగి కొండెక్కిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది.

Inspiration & HumorMeisterschaft
HMTV1. Sept.

Off The Record: కర్నూలు పార్టీపై చంద్రబాబు లోకేష్ ఫోకస్!

Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గపోరు. ఆదోని, మంత్రాలయం, ఆలూరు, నంద్యాల నియోజకవర్గాల్లో అసమ్మతిని చక్కదిద్దేందుకు మంత్రుల బృందం రంగంలోకి.

Inspiration & HumorMittelstufe
Sakshi1. Sept.

సముద్ర భద్రతపై కొత్త సవాళ్లు!

సముద్ర భద్రతపై కొత్త సవాళ్లు!  eshwar Tue, 09/01/2026 - 06:30

AlltagGute Mittelstufe
HMTV1. Sept.

Suryapet: సూర్యాపేట రైల్వే పోరాటం: వినూత్నంగా 'జన హుండీ' ఏర్పాటు!

Suryapet: రైల్వే సాధన ఉద్యమం కోసం ప్రజల భాగస్వామ్యంతో 'జన హుండీ' ఏర్పాటు చేసిన రైల్వే సాధన సమితి. పూర్తి పారదర్శకతతో విరాళాల సేకరణ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

UnterhaltungGute Mittelstufe
Sakshi1. Sept.

CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం!

CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం! sirikumar Tue, 09/01/2026 - 07:04

Business & KarriereGute Mittelstufe
TV9 Telugu1. Sept.

వర్షాకాలానికి బెస్ట్‌ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్‌ కోసం చిట్కాలు!

వర్షాకాలం లేదంటే చలికాలంలో వేడివేడి బెల్లం టీ తాగడం వల్ల శరీరానికి మంచి శక్తి, ఉపశమనం లభిస్తాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, చాలామందికి బెల్లం టీ చేసేటప్పుడు పాలు విరిగిపోతుంటాయి. కొద్దిపాటి జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే విరిగిపోకుండా పర్ఫెక్ట్ బెల్లం టీ తయారు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..